- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ఆర్థిక శాఖపై టీడీపీది శ్వేతపత్రం కాదు.. సాకుల పత్రం: మాజీ మంత్రి బుగ్గన
దిశ, వెబ్‌డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం మొదటి అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తుంది. ఇందులో గత ప్రభుత్వానికి సంబంధించిన పలు శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో సీఎం శ్వేతపత్రాన్ని విడుదల చేసి గత ప్రభుత్వం చేసిన తప్పులు బయటపెట్టారు. దీనిపై మాజీ మంత్రి బుగ్గన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు సభలో ప్రవేశ పెట్టింది శ్వేత పత్రంలా లేదని.. సాకు పత్రంగా కనిపిస్తుందని విమర్శించారు. సభలో సీఎం చంద్రబాబు చెప్పినవన్ని సాకులే అంటూ మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. టీడీపీ హయాంలోనే అప్పు 21.63 శాతం పెరిగిందని.. వైసీపీ పాలనలో గత ఐదు సంవత్సరాల్లో 12.9 శాతం మాత్రమే పెరిగిందని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం మ్యాచ్ ప్రారంభ మొదటి ఓవర్ లోనే కూటమి సూపర్ సిక్స్ డకౌట్ అయిందని.. ఇంతవరకు బడ్జెట్ ప్రవేశ పెట్టలేదని అన్నారు. అలాగే ఏపీ అప్పులపై కేంద్ర ఎప్పుడో క్లారిటీ ఇచ్చిందని.. టీడీపీ నేతలు మాత్రం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు.