- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking News: మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. బీపీ, షుగర్ లెవల్స్ పెరగడంతో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సత్యనారాయణ మూర్తి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు. సత్యనారాయణ మూర్తి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు. మూర్తి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
కాగా సత్యనారాయణ మూర్తి టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. గతంలో ఆయన మంత్రిగా కూడా పని చేశారు. గత ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేసిన సత్యనారాయణ మూర్తి ఓటమి పాలయ్యారు. అయినా సరే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహిస్తూ వచ్చారు. వచ్చే ఎన్నికల్లో పెందుర్తి టికెట్ ఆశించారు. కానీ ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లింది. దీంతో సత్యనారాయణ మూర్తి మనస్తాపం చెందారు. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వైసీపీ నేతలో టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధిష్టానం ఆయనకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే సడెన్‌గా ఆయన అస్వస్థతకు గురికావడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.