- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్‌పై మాజీ మంత్రి బాలినేని ప్రశంసలు.. ఎందుకంటే?
దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖలో జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 విజయవంతం కావడం రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవాళ్లు లేరని ప్రచారం చేసేవారికి చెంపపెట్టులాంటిది అని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం లేదని అందుకు వైసీపీ ప్రభుత్వమే కారణమంటూ దుష్ప్రచారం చేశారని వారందరికీ ఈ సమ్మిట్ విజయవంతంతో కనువిప్పుకలుగుతుందని చెప్పుకొచ్చారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓ విజన్‌తో ముందుకు వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. విశాఖ సమిట్తో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారన్నారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమన్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ లాంటి వ్యాపారవేత్తలు ముందుండి విశాఖ సదస్సును విజయవంతం చేయడం చాలా అభినందనీయమన్నారు. రాష్ట్రంలో త్వరలో రాబోయే కంపెనీల వల్ల లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతోనే విశాఖను రాజధానిగా ప్రకటించారని అందులో తప్పేముందన్నారు. అభివృద్ధి చెందిన సిటీని మరింత వేగంగా అభివృద్ధి చేయవచ్చని..అమరావతి లాంటి ప్రాంతాన్ని అభివృద్ది చేయాలంటే లక్షల కోట్లు అవసరమన్నారు. మూడు రాజధానుల విధానానికే వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.