రషీద్‌ది రాజకీయ హత్యే.. వెనుక ఎమ్మెల్యే: అంబటి రాంబాబు ఫైర్

by srinivas |   ( Updated:2024-07-21 15:25:07.0  )
రషీద్‌ది రాజకీయ హత్యే.. వెనుక ఎమ్మెల్యే:  అంబటి రాంబాబు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: వినుకొండ హత్య రాజకీయ హత్యేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. సత్తెనపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రషీద్ ను నడిరోడ్డుపైనే చంపేశారని ఆరోపించారు. చంపిన వ్యక్తి ప్రస్తుతం టీడీపీలో పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జిలానీ గతంలో వైసీపీలో పని చేశారని, లావు శ్రీకృష్ణ దేవరాయులు, ఆనం రామనారాయణరెడ్డి ఎలా పార్టీ మారారు జిలానీ సైతం అలానే చేసిఉండొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రోద్బలంతోనే రషీద్ హత్య జరిగిందని ఆరోపించారు. ఈ హత్యలో ప్రోద్బలం లేకపోతే ఇప్పటి వరకూ బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో జీవీ ఆంజనేయులు ప్రస్థావన ఉందని తెలిపారు. గతంలో రషీద్‌పై ఎలాంటి నేర చరిత్ర లేదని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా జరుగుతోందని హోంమంత్రి అనితనే అంగీకరించారని తెలిపారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతున్నా గంజాయిని ఎందుకు అరికట్టలేదని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More..

AP Politics:‘పరామర్శకు వెళ్లి పథకాల గురించి మాట్లాడతారా?’ ..ఆగ్రహం వ్యక్తం చేసిన హోం మంత్రి

Advertisement

Next Story

Most Viewed