ఆశలు అడియాశలయ్యాయి.. ఏపీ బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన విమర్శలు

by srinivas |   ( Updated:2024-11-11 11:06:52.0  )
ఆశలు అడియాశలయ్యాయి.. ఏపీ బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌(Ap Badget)ను ప్రవేశపెట్టింది. రూ.2, 94, 427.25 కోట్లతో ఆయా శాఖలకు కేటాయింపులు జరిపింది. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌‌రెడ్డి(Former Minister Buggana Rajendranath Reddy) విమర్శలు కురిపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సర్కార్ ప్రవేశ‌పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌(Vote on Account Budget) మాదిరిగానే ఇప్పటి వరకూ కొనసాగించడడాన్ని ఆయన తప్పు బట్టారు. తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే బడ్జెట్ ప్రవేశ పెట్టామని గుర్తు చేశారు. కరోనా లాంటి విపత్కర సమయంలోనూ బడ్జెట్ ఆపలేదన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఐదే నెలలపాటు బడ్జెట్ పెట్టలేదని చెప్పారు. ఇంత అనుభవం ఉన్నా బడ్జెట్ ఎందుకింత ఆలస్యమైందని ప్రశ్నించారు. ఎన్నో ఆశలతో ఈ ప్రభుత్వానికి గెలిపించారని, ఇంటింటికి తిరిగి చాలా హామీలు ఇచ్చారని, ఈ బడ్జెట్‌తో ప్రజ ఆశలు అడియాశలయ్యాయని బుగ్గన విమర్శించారు.

‘‘పథకాలకు కేటాయింపులు లేకుండా రూ. 41 వేల కోట్లు ఎక్కువ చూపించారు. బడ్జెట్‌లో రూ. 5 వేల కోట్లు ఎక్కడెక్కడో కేటాయించారు. మైనస్‌లో ఉన్న తమరు 6 నెలల్లో రూ. 24 వేల కోట్లు పన్ను ఆదాయం ఎలా పెంచుతారు. అన్నదాత సుఖీభవ పథకం ఎంతమందికి అమలు చేస్తారో చెప్పాలి. అన్నదాత సుఖీభవ పథకానికి రూ. 10,706 కోట్లు అవసరం, కానీ బడ్జెట్‌లో పెట్టింది రూ. 1000 కోట్లు మాత్రమే. నిరుద్యోగ భృతికి బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారా?. అమరావతి రాజధానికి కేంద్రం ఇస్తున్న రూ. 15 వేల కోట్లు గ్రాంటా..? అప్పా..?. ఆడ బిడ్డ నిధి ఇవ్వాలంటే రూ. 37, 300 కోట్లు కావాలి, కానీ రూపాయి కేటాయించలేదు. తల్లి వందనం ఇంటింటికి ఎంత ఇవ్వబోతున్నారో చెప్పాలి.’’ అని మాజీ మంత్రి బుగ్గన ప్రశ్నించారు.

Advertisement

Next Story
null