AP News:మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం..?

by Jakkula Mamatha |   ( Updated:2024-07-28 14:36:27.0  )
AP News:మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం..?
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ సారి ఎన్నికల్లో గెలుపు పై ధీమాతో ఉన్న వైసీపీ మాత్రం ఊహించని విధంగా ఓటమి పాలైంది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో పలువురు వైసీపీ నేతల్లో అసహనం నెలకొంది. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ కార్యకర్తలు, పార్టీ నేతలను పరామర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమి గల కారణాలు ఏంటో అని పార్టీ నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇది వరకే చర్చించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలతో మమేకం కావాడానికి వైఎస్ జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. దీనిపై తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ ముహూర్తాలు చూసుకుంటూ అడుగులు వేస్తున్నారని సమాచారం. దీంతో రానున్న శ్రావణమాసంలో సంచలన నిర్ణయాలు ఉంటాయాని ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో నిర్వహించాలనుకున్న ప్రజా దర్బార్ కార్యక్రమం వాయిదా పడింది. అయితే అషాడమాసం కావడంతోనే ప్రజాదర్బార్‌ని మాజీ సీఎం జగన్ ప్రారంభించలేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు 5 నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. దీంతో జగన్ ప్రజా దర్బార్ ఆగస్టు మొదటి వారంలో నిర్వహించడానికి నిర్ణయించారని సమాచారం.

Advertisement

Next Story