వరదలను డైవర్ట్ చేసేందుకే నందిగం అరెస్ట్.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-09-11 07:55:36.0  )
వరదలను డైవర్ట్ చేసేందుకే నందిగం అరెస్ట్.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను (Former Mp Nandigam Suresh) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Ys Jagan Mohan Reddy) గుంటూరు జిల్లా జైలులో పరామర్శించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై (Mangalagiri Tdp Office) దాడి చేసిన కేసులో రిమాండ్‌లో ఉన్న సురేశ్‌ను కలిసేందుకు జగన్ గుంటూరు జిల్లా జైలు (Guntur District Jail) వద్దకు వెళ్లారు. ములాఖత్‌లో నందిగం సురేశ్‌తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను కలిసి ధైర్యం చెప్పారు.

అనంతరం జైలు బయట జగన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇలాంటి దుర్మార్గమైన పాలన చూడలేదని ఎద్దేవా చేశారు. వరదలను డైవర్ట్ చేసేందుకే నందిగం సురేశ్‌ను, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేశారని ఆరోపించారు. వరదలు ప్రభుత్వ వైఫల్యమన్నారు. 60 మంది మరణాలపై ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. నాలుగు సంవత్సరాల క్రితం పట్టాభి తనను బూతులు తిట్టారని, అందుకే పార్టీ అభిమానులు టీడీపీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. ఆ సమయంలో వైసీపీ అభిమానులతో టీడీపీ శ్రేణులు గొడవకు దిగారని, అప్పుడు టీడీపీ కార్యాలయంపై రాళ్లు పడి ఉండొచ్చని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed