- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మే 13న ఏపీ ఎన్నికలు.. మాజీ సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..(వీడియో)!
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25 నామినేషన్లకు చివరి గడువు కాగా ఏప్రిల్ 26న పరిశీలన, స్కుటినీ ఉంటుంది. 29న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, రాష్ట్రంలో తక్షణమే కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల సంఘం అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు.
అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. 5 ఏళ్లుగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమేనని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని, జగన్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు. ఇక పోలింగే మిగిలిందని తెలిపారు. ఒక్క చాన్స్ ప్రభుత్వానికి ఇక నో చాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజాగళం వినిపించే రోజు వచ్చిందని చెప్పారు. నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు స్వాగతం పలుకుదామని, ఇక రాష్ట్రానికి అన్నీ మంచి రోజులేనని చంద్రబాబు ట్వీట్ చేశారు.
5 ఏళ్లుగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమే....ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.... జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.... ఇక పోలింగే మిగిలింది.ఒక్క చాన్స్ ప్రభుత్వానికి ఇక నో చాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజాగళం వినిపించే రోజు వచ్చింది...నవశకం… pic.twitter.com/Y2lisH7ge1— N Chandrababu Naidu (@ncbn) March 16, 2024