AP News : ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్ కు కీలక బాధ్యతలు

by M.Rajitha |
AP News : ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్ కు కీలక బాధ్యతలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇస్రో మాజీ సీఎస్ సోమనాథ్ (Former CS Somanath) కు కీలక బాధ్యతలు కట్టబెట్టింది ఏపీ ప్రభుత్వం(AP Govt). రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహదారుని(Honorary Advisor)గా నియమించింది. పరిశ్రమలు, పరిశోధనలు, స్మార్ట్ సిటీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్ కమ్యూనికేషన్ టెక్నాలజీపై సలహాలు ఇవ్వాలని కోరింది. అలాగే ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అడ్వైజర్ గా కేపీసీ గాంధీని(KPC Gandhi) నియమించింది. అదేవిధంగా భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా(Suchitra Ella)ను చేనేత, హస్తకళలకు డీఆర్డీవో మాజీ చీఫ్ జి. సతీష్ రెడ్డి(G.Sathish Reddy)ని ఏరో స్పేస్, డిఫెన్స్ మ్యాన్యుఫాక్చరింగ్ హబ్ గౌరవ సలహదారులుగా నియమిస్తూ ఏపీ సీఎస్ విజయానంద్(CS Vijayanand) ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా కేబినెట్ హోదాలో రెండేళ్లపాటు కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Next Story

Most Viewed