ప్రజలకు చంద్రబాబు సంక్రాతి శుభాకాంక్షలు.. స్వర్ణయుగ నాందికి పిలుపు

by Indraja |
ప్రజలకు చంద్రబాబు సంక్రాతి శుభాకాంక్షలు.. స్వర్ణయుగ నాందికి పిలుపు
X

దిశ వెబ్ డెస్క్: తెలుగు ప్రజలు జరుపుకునే పండుగల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన సంక్రాంతి పండుగ సమయం దగ్గర పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన ఆ తరువాత అధికార ప్రభుత్వ పరిపాలన పై ధ్వజమెత్తారు. ఐదేళ్ల రాతియుగ పరిపాలనకు స్వస్తి పలికి స్వర్ణ యుగానికి నాంది పలకాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. గడిచిన ఐదేళ్లలో అధికార ప్రభుత్వ అరాచక పాలనలో ప్రతి ఒక్కరి జీవితలో అధికారం అలుముకుందని ఆయన పేర్కొన్నారు.

రేయనక పగలనకా ఆరుకాలం శ్రమించి రైతులు పంట పండిస్తే.. తీరా ఆ పంటకి గిట్టుబాటు ధర లేదని ఆయన మండిపడ్డారు. ఇక పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీసేలా నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి శూన్యమని ఆరోపించిన ఆయన.. వైసీపీ నేతలు జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడుస్తుందని పదేపదే పేర్కొంటున్నారని.. వారి దృష్టిలో అభివృద్ధి అంటే నిరుద్యోగం, అస్తవ్యస్తమైన రోడ్లు, భయపెడుతున్న బస్సు చార్జీలు ఇవేనా అభివృద్ధి అంటే అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

నిరుద్యోగం,పెరిగిన నిత్యవసర ధరలు గ్రామాల్లో పండుగ కళని దెబ్బ తీసాయన్నారు. టిడిపి హయాంలో పేద ప్రజలు కూడా పండుగను ఆనందంగా జరుపుకోవాలని.. టిడిపి ప్రభుత్వం సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కానుకలను ఇచ్చేదని.. అయితే అధికార ప్రభుత్వం ఆ కానుకలను కూడా రద్దు చేసి పండుగ సంతోషాలను ప్రజలకు దూరం చేసిందని ఆయన మండిపడ్డారు. వైసిపి విధ్వంసకర పాలనలో.. వివేక రహిత విధానాలతో యువత ఉపాధి లేక రోడ్డున పడిందన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని అటకెక్కించిన వైసీపీ ప్రభుత్వం కనీసం మహిళలకు కూడా రక్షణ కల్పించలేక విఫలమైందని టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed