నిన్న జగన్‌కు ..నేడు చంద్రబాబుకు జై కొడుతున్న జేడీ లక్ష్మీనారాయణ

by srinivas |   ( Updated:2023-05-15 11:35:44.0  )
నిన్న జగన్‌కు ..నేడు చంద్రబాబుకు జై కొడుతున్న జేడీ లక్ష్మీనారాయణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వైసీపీ ప్రభుత్వానికి ఇటీవలే థాంక్స్ చెప్పిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయానికి జై కొట్టారు. చంద్రబాబు నాయుడు రూ.2 వేలు, రూ.5వందల నోట్ల రద్దు అంశం ప్రతిపాదనను స్వాగతించారు. దేశంలో ఆర్థిక నేరాలను తగ్గించేందుకు, ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీని అరికట్టేందుకు రూ.2,000, రూ.500 నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

అయితే చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదనను సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సమర్థించారు. తాను కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సంస్కరణలో భాగంగా రూ.2,000 నోటును రద్దు చేయాలని తాను ఎప్పటినుంచో చెప్తున్నానని అన్నారు. తక్షణమే ఆ పెద్ద నోటు రద్దు చేయాలని వీవీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని సిఫారసు చేయాలని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.

Read more:

జగన్ సర్కార్‌కు థాంక్స్ చెప్పిన సీబీఐ మాజీ జేడీ

Advertisement

Next Story

Most Viewed