AP: కోనసీమకు వరద ముప్పు

by Prasanna |
AP: కోనసీమకు వరద ముప్పు
X

దిశ, కోనసీమ ప్రతినిధి: కోనసీమ జిల్లాకు వరద ముప్పు పొంచి ఉంది. వరద నీరు చేరుకోవడంతో. కోటి పల్లి నుంచి రావులపాలెం దాకా ఏటి గట్టు పొడవునా ఉన్న లంక గ్రామాలు నీటమునుగుతున్నాయి. జొన్నాడ, కోటిపల్లి, ధవలేశ్వరం వద్ద గోదావరి ఉరకలు వేస్తోంది. దీంతో జనం బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. పలు చోట్ల రహదారులు జలమయం అవ్వడంతో రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలో ముమ్మిడివరం నియోజకవర్గంలోని లంక గ్రామాల్లో శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు పర్యటించారు. ముందస్తు చర్యలు కోసం అధికారులను ఆదేశించారు.

నీట మునిగిన ఇళ్ళు..

కోనసీమలో ముమ్మిడివరం, రాజోలు, పి గన్నవరం తదితర ప్రాంతాల్లోని లంక గ్రామాలకు వరద నీరు చేరుకొంది. ఏ క్షణా నైనా ఏటి గట్టుకు గండి పడే అవకాశం ఉంటుందని అనేక మంది ఆందోళన చెందుతన్నారు. సుందరపల్లి వద్ద ముందస్తు చర్యగా ఇసుక బస్తాలు సిద్ధం చేశారు.

రోడ్లు జలమయం..

రామచంద్రపురం నియోజకవర్గంలో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ముఖ్యంగా గొల్ల పాలెం - కుయ్యేరు రోడ్డు, అయితపూడి రోడ్డు, పటవల రోడ్డులు పూర్తిగా నీట మునిగాయి. ఇదిలా ఉండగా, కోటిపల్లి, యానాం, జొన్నాడ గోదావరి నది ఉగ్ర రూపం దాలుస్తోంది. గంట గంటకు ప్రవాహం పెరుగుతోంది. దీనికి తోడు శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఏ క్షణం ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయాన్ని జనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed