- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘Andhra Pradesh నెక్ట్స్ సీఎం Jr. NTR.. అసలోడు వచ్చేవరకే.. కొసరోడికి పండగ’’
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల టీడీపీ మీటింగులు, సభల్లో జూ. ఎన్టీఆర్ సీఎం అంటూ ఆయన అభిమానులు హల్ చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా టీడీపీ నిర్వహించిన మినీ మహానాడులో సైతం జూనియర్ అభిమానులు ఎన్టీఆర్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడంతో పాటు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఇదిలా ఉండగా.. ఏపీలో మరోసారి స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో మంగళవారం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.
‘‘ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్.. అసలోడు వచ్చేవరకే.. కొసరోడికి పండగ’’ అంటూ రాసిన ఫ్లెక్సీలు ఒంగోలు ప్రత్యక్షమయ్యాయి. మాజీ మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ ఒంగోలు పర్యటన సమయంలోనే ఎన్టీఆర్ సీఎం అంటూ ఫ్లెక్సీలు ప్రత్యక్షమవ్వడం టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వెంటనే అప్రమత్తమైన స్థానిక తెలుగు తమ్ముళ్లు ఆ ఫ్లెక్సీలను అక్కడి నుండి తొలగించారు. లోకేష్ పర్యటన వేళ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఎవరూ ఏర్పాటు చేశారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు.
Also Read: అప్పుడు నాకు మాటలు రాలేదంటూ ఎమోషనల్ అయిన Vijay Deverakonda..