- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం
దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కలెక్టరేట్‌లోని ప్రధాన కార్యాలయం వెనుక భాగంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అయితే ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలని అదుపులోకి తీసుకువచ్చారు. రెండో శనివారం కలెక్టరేట్ కార్యాలయానికి సెలవుకావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో పలు ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇకపోతే నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడం కొత్తేమీ కాదు. గతంలో రెండుసార్లు అగ్ని ప్రమాదం జరిగింది. కోట్లాది రూపాయల కుంభకోణాలు, అనేక కేసులకు సంబంధించిన ఫైళ్లు దగ్ధం అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలు ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఏమి ఫైళ్లు తగలబడ్డాయి.. ఎంతమేర నష్టం జరిగింది అనేదానిపై విచారణలో తేలాల్సి ఉంది.