వైసీపీ నేతల్లో ఐదో విడత టెన్షన్.. ఎవరికి మూడిందో..!

by srinivas |
వైసీపీ నేతల్లో ఐదో విడత టెన్షన్.. ఎవరికి మూడిందో..!
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేతల్లో ఐదో విడత టెన్షన్ పట్టుకుంది. ఇప్పటి వరకు నాలుగు విడతలు విడుదల చేసిన సీఎం జగన్ ఐదో విడతలో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ లిస్టు కోసం వడపోతలు ప్రారంభించారట. పలువురు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నారట. దీంతో ఎవరికి మూడిందోనన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో మొదలైంది.

కాగా వైనాట్ 175 అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గాలకు ఇంచార్జుల విషయంలో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. మొత్తం 68 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. ఇందులో 58 అసెంబ్లీ స్థానాలు, 10 లోక్ సభ సీట్లకు సమన్వయకర్తలను నియమించారు. 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు. దీంతో పలువురి నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. మరి కొంత మంది పలు పార్టీల వైపు చూస్తున్నారు.

అయినా సీఎం జగన్ వెనక్కి తగ్గడం లేదు. పకడ్బందీగా ఆయన ముందుకు వెళ్తున్నారు. కానీ పలు నియోజకవర్గాల్లో పార్టీ ఇంచార్జుల మార్పుపై సీఎం జగన్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఒంగోలు ఎంపీ విషయంలో తర్జన భర్జన కొనసాగుతోంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంటకు ఈసారి టికెట్ ఇవ్వమనే నిర్ణయంలో సీఎం జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అటు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు మద్దతు తెలుపుతున్న వైసీపీ అధిష్టానం ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. ఇలా పలు నియోజకవర్గాల్లో సీట్ల వ్యవహారంపై ఇంకా క్లారిటీకి రాలేదు. దీంతో ఐదో జాబితాలో ఎవరి పేరు ఉంటుందో.. ఊడుతుందోననే టెన్షన్ ఆయా నియోజకవర్గాల నేతల్లో కొనసాగుతోంది. మరి సీఎం జగన్ ఐదో విడుదల లిస్టు విడుదల చేసి ఎలాంటి సంచలనానికి తెర తీయబోతున్నారనో చూడాలంటే ఆగాల్సిందే...

Advertisement

Next Story

Most Viewed