ఫైబర్ నెట్ కేసు: మరికాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ

by Seetharam |
ఫైబర్ నెట్ కేసు: మరికాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై మరికాసేపట్లో శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుద్ బోస్ , జస్టిస్ బేలా ఎం త్రివేదిల నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణ జరగనుంది. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పు తరువాత ఫైబర్ నెట్ కేసు విచారిస్తామని గతంలో ధర్మాసనం పేర్కొంది. అయితే నేటి కేసుల విచారణ జాబితాలో ఫైబర్ నెట్ కేసు ఉంది. కానీ స్కిల్ స్కాం కేసులో క్వాష్ పిటిషన్ తీర్పు లిస్ట్ కాలేదు. దీంతో ఫైబర్ నెట్ కేసు విచారణపై సుప్రీంకోర్టు ద్విసభ్యధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed