ఫైబర్‌ నెట్‌ కేసు.. చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ నేడే

by Indraja |
ఫైబర్‌ నెట్‌ కేసు.. చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ నేడే
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమయం దగ్గర పడుతోంది.. ఈ నేపధ్యంలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవ్వాల్సిన తెలుగు దేశం పార్టీ అధినేత.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యంత్రి నారా చంద్రబాబు నాయుడు కోర్టుల చుటూ తిరగాల్సి వస్తోంది. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై నిన్న విచారణ జరిపిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో.. సీజేఐకి అప్పగించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరపనుంది సుప్రీంకోర్టు.

కాగా గతంలో టీడీపీ అధినేత ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేయగా.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ను నిరారించిన విషయం తెలిసిందే. దీనితో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. కాగా హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ చంద్రబాబు సుప్రీంలో వేసిన ఫిటీషన్ పై నేడు జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలాఎం త్రివేదీల ధర్మాసనం విచారణ జరపనుంది.

Advertisement

Next Story

Most Viewed