భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాల్లేవ్.. టోల్ ప్లాజా వద్ద రైతుల నిరసన

by Disha News Desk |
భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాల్లేవ్.. టోల్ ప్లాజా వద్ద రైతుల నిరసన
X

దిశ, పిట్లం: జాతీయ రహదారి 161 నిర్మాణ పనుల్లో పిట్లం మండలం లోని చిన్న కొడప్గల్ వద్ద ధర్మారం టోల్ ప్లాజా ను నిర్మాణం చేశారు. గురువారం నాడు ప్రాజెక్ట్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి ప్రారంభం చేశారు. ప్రారంభం కాగానే చిన్న కొడంగల్ గ్రామానికి చెందిన రైతులు భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ ధర్నా నిర్వహించారు. జాతీయ రహదారి నిర్మాణం చేపట్టి క్రమంలో అది రోడ్డు నిర్మాణం కొరకు రైతుల నుండి భూములు కోల్పోయిన వారికి 50 శాతం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశారని ధర్నా చేశారు. చిన్న కొడపగల్, ధర్మారం గ్రామాల సర్పంచులు, సొసైటీ చైర్మన్, ఎంపీటీసీలు ధర్నా చేపట్టిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ తో మాట్లాడుతూ చిన్న కొడప్గల్ గ్రామంలో నీ ఆరు మంది దళితులకు భూములు కోల్పోయిన వారికి ఇప్పటివరకు డబ్బులు రాలేదని ఆయన నిలదీశారు.


కలెక్టర్, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లిన ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో డ్రైనేజీ, కరెంటు స్తంభాలు సరైన పద్ధతిలో నిర్మాణం చేపట్టకపోవడంతో టీడీపీకి తీసుకువెళ్లగా వాటిని వారం రోజుల్లో మరమ్మతులు చేసి సరైన రీతిలో హామీ ఇచ్చారు. భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టోల్ ప్లాజా లో ఉద్యోగాల అవకాశాలను వేరే రాష్ట్రాల నుండి ఎందుకు తెచ్చుకున్నారు అని ప్రశ్నించగా నూతనంగా నిర్మించే టోల్ ప్లాజా లో అనుభవం ఉన్నవారికి ముందుగా వారికి కేటాయించామని, నూతనంగా ఉద్యోగాలు కల్పించే వారికి శిక్షణ తరగతులు చేపట్టి వారిని కూడా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడంతో టోల్ ప్లాజా వద్ద ధర్నాను పోలీసులు రావడంతో ధర్నాను విరమించారు.

Advertisement

Next Story

Most Viewed