- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Chandrababu Naidu : చంద్రబాబుతో నేడు కుటుంబ సభ్యుల ములాఖత్
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ 40వ రోజుకు చేరుకుంది. సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో బుధవారం చంద్రబాబు నాయుడుతో కుటుంబ సభ్యులు భేటీ కానున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, సతీమణి భువనేశ్వరీ, కోడలు నారా బ్రాహ్మణిలు ములాఖత్‌లో భాగంగా బుధవారం మధ్యాహ్నాం 3 గంటలకు కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్‌పై అధికారులు కోతలు విధించారు.ఇప్పటి వరకు రోజుకు 2 సార్లు చంద్రబాబుతో ములాఖత్ అయ్యే లాయర్లకు ఇకపై ఒకసారే ములాఖత్ ఇస్తామని ప్రకటించింది. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు రిమాండ్ ఈనెల 19తో ముగియనుంది.