- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ!
దిశ, ప్రతినిధి నరసరావుపేట: ప్రతిష్టాత్మక సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పదవి కోసం ముగ్గురు టీడీపీ సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో పల్నాడు ఎమ్మెల్యేలతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం తాడేపల్లి లోని తన నివాసంలో సమావేశం అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పల్నాడు జిల్లా రైతులే అధికం..
నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు పరిధిలో పల్నాడు జిల్లా రైతులు ఎక్కువగా ఉన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా దీని పరిధి విస్తరించి ఉంది. నీటి సంఘాల అధ్యక్షులు, డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షుల ఎన్నికల ఇప్పటికే పూర్తయింది. మొత్తం 48 డీసీ చైర్మన్లు ఉన్నారు. వీరంతా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ను ఎన్నుకుంటారు. ఆ ఎన్నిక వచ్చే వారం జరగనుంది.
ఆశావహులు వీరే..
సత్తెనపల్లి నుంచి మాజీ మండలాధ్యక్షుడు గోగినేని కోటేశ్వరరావు, నరసరావుపేట నుంచి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పులిమి రామిరెడ్డి, గురజాల నుంచి మాజీ మండల అధ్యక్షుడు పులుకూరి కాంతారావు.. ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. వారికి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, చదలవాడ అరవింద బాబు, యరపతినేని శ్రీనివాసరావు మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలో ఎంపీ కృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మనందరెడ్డి, భాష్యం ప్రవీణ్ ఎవరి అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతారో అన్నది సస్పెన్స్‌గా మారింది. మొత్తమ్మీద నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠకు మరో నాలుగు రోజుల్లో తెరపడనుంది. సీఎం చంద్రబాబు అభ్యర్థిని నిర్ణయించే వరకు ఇది ఇలానే కొనసాగుతుందని పల్నాడు టీడీపీ నాయకులు భావిస్తున్నారు.