Sunitha Williams: సునీత రాకపై ఉత్కంఠ .. అన్నీ అనుకూలిస్తే 20న భూమికి..

by Anil Sikha |
Sunitha Williams: సునీత రాకపై ఉత్కంఠ .. అన్నీ అనుకూలిస్తే 20న భూమికి..
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాసా వ్యోమగాములు, సునీత విలియమ్స్, (Sunita Williams) బుచ్ విల్ మోర్ (Butch Wilmore) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (Space station) నుంచి భూమికి రాక ఉత్కంఠ రేపుతోంది. అన్నీ అనుకూలిస్తే వారిద్దరూ ఈనెల 20వ తేదీన భూమికి చేరుకోనున్నారు. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 4.30 గంటలకు క్రూ-10 ప్రయోగానికి నాసా(NASA)మరోసారి ఏర్పాట్లు చేసింది. ఇందులోనే భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్‌ భూమికి రానున్నారు. వారిద్దరిని తీసుకొచ్చేందుకు నిన్న జరిగిన ప్రయోగం చివరి నిమిషంలో నిలిచిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం ఆగిపోయింది. దీంతో వారు అంతరిక్షం నుంచి బయలుదేరడం వాయిదా పడింది. అయితే ఆ సమస్యను అధిగమించి రేపు ఉదయం వారిని భూమికి తీసుకువచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేసింది. వీరిద్దరూ గత ఏడాది జూన్ 5న ప్రయోగించిన షార్ట్ లైన్ లో అంతరిక్ష పరిశోధన కేంద్రానికి చేరుకున్నారు. ఎనిమిది రోజుల ప్రయోగం కోసం వెళ్లిన వాళ్లు స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దాదాపు 8 నెలలకు పైగా అక్కడే ఉండిపోయారు. వారిని తీసుకువచ్చేందుకు నాసా కొద్ది నెలలుగా ప్రయత్నిస్తోంది. నిన్న వారు తిరిగి బయలుదేరేందుకు ఏర్పాటు చేయగా కొన్ని సాంకేతిక సమస్యలతో ఆగిపోయారు. వాటిని సరిచేసి వ్యోమగాములను (Astronauts) భూమికి రప్పించేందుకు నాసా ప్రయత్నిస్తోంది.

Next Story

Most Viewed