Vidadala Rajani:ఆరోగ్య శ్రీ పెండింగ్ బిల్లులపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు?

by Jakkula Mamatha |
Vidadala Rajani:ఆరోగ్య శ్రీ పెండింగ్ బిల్లులపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు?
X

దిశ,వెబ్‌డెస్క్: ఆరోగ్యశ్రీ పై ప్రభుత్వ విధానం ఏంటో వెల్లడించాని మాజీ మంత్రి విడదల రజని డిమాండ్ చేశారు. అప్పుల సాకుతో ఆరోగ్యశ్రీ నుంచి ప్రభుత్వం వైదొలుగుతొందా అనే భయం ప్రజల్లో నెలకొంది. కేంద్రం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చెబుతున్నారు. సీఎం చంద్రబాబు మనసులోని మాటలను పెమ్మసాని చెబుతున్నారా? అని వైసీపీ నేత విడుదల రజిని ప్రశ్నించారు. ఆయుష్మాన్ లిమిట్ రూ.5లక్షలే అని చెప్పారు. ఆరోగ్య శ్రీ లిమిట్‌ను పేదల కోసమే వైఎస్ జగన్ రూ.25 లక్షలు పెంచారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి విడదల రజని ఫైరయ్యారు. వైసీపీ హయాంలో జనవరి వరకు ఉన్న ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు అన్నింటినీ చెల్లించామని ఆమె స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా తామే చెల్లించామని అన్నారు. జనవరి వరకు తాము చెల్లించిన బకాయిలు పోగా, ఆ తర్వాత ఉన్న బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని రజని స్పష్టం చేశారు.

Advertisement

Next Story