అలకపాన్పు ఎక్కిన మాజీ మంత్రి.. హైదరాబాద్‌‌కు పయనం

by Shiva |   ( Updated:2024-01-10 15:34:41.0  )
అలకపాన్పు ఎక్కిన మాజీ మంత్రి.. హైదరాబాద్‌‌కు పయనం
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తమ గెలుపు గుర్రాలపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గాల్లో ఇంచార్జీల మార్పునకు శ్రీకారం చుట్టారు. దీంతో పార్టీలో ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయి. కొందరికి సీట్లు ఖాయమైతే, మరికొందరికి టికెట్లు దక్కకపోడంతో అసంతృప్తులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో నేత సీఎం జగన్‌ అభ్యర్థులను ఎంపిక చేస్తుండగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో ఆయన అలక పాన్పు ఎక్కి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అయితే, మూడు రోజుల క్రితం సీఎం జగన్‌తో భేటీ ఉందంటూ విజయసాయి రెడ్డి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ నుంచి విజయవాడకు పిలిపించారు. కానీ, సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో బాలినేని అసంతృప్తికి గురై హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.

Advertisement

Next Story