YSRCP:పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపం.. ఘాటుగా స్పందించిన మాజీ మంత్రి

by Jakkula Mamatha |   ( Updated:2024-12-28 15:31:07.0  )
YSRCP:పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపం.. ఘాటుగా స్పందించిన మాజీ మంత్రి
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటన పై వైసీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) స్పందించారు. ఈ క్రమంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్(Fake IPS) వస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తప్పు జరిగితే తోలు తీస్తానన్న పవన్ కల్యాణ్ మాటలు ఏమైపోయాయన్నారు. తన సెక్యూరిటీ(Security)లో వైఫల్యాలకు ఎవరిని బాధ్యుల్ని చేస్తారన్నారు. నకిలీ ఐపీఎస్ అధికారితో పోలీసులు ఫొటోలు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.


Read More..

Pawan Kalyan: చాలా కార్యక్రమాలు రద్దు చేసుకుని గాలివీడుకు వచ్చా


డీజీపీ ద్వారకా తిరుమల రావు అంటే గౌరవం ఉంది. కానీ.. ఆయనకు పదవి వచ్చిన తర్వాత డీజీపీ అనే సంగతి మర్చిపోయారని విమర్శించారు. డీజీపీ తమ ఫోన్ ఎత్తడానికి కూడా భయపడిపోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం(AP Government) విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై రూ.15,000 కోట్ల భారం మోపుతోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల(Electricity Charges) పెంపు నిర్ణయాన్ని సర్కార్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ప్రభుత్వం 7 నెలల్లోనే రూ.74 వేల కోట్ల అప్పు చేసింది. వరల్డ్ బ్యాంక్ నుంచి రూ. 15 వేల కోట్లతో కలిపి రూ.లక్ష కోట్ల అప్పు చేసింది. ఎన్నికల హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?’ అని ఆయన నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed