- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
బాలీవుడ్ నటి కేసు... పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: బాలివుడ్ నటి కేసుపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. ఆ కేసంతా డ్రామా అని ఆయన కొట్టిపారేశారు. కొంత మంది ఐపీఎస్‌లను టార్గెట్ చేశారని, అందుకోసమే నటి కేసును తెరపైకి తీసుకొచ్చారని చెప్పారు. కొంతమంది అధికారులపై కేసులు పెట్టేందుకే కొత్త డ్రామాకు తెరతీశారని వ్యాఖ్యానించారు. ఆ కేసులో నిందితుడితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మహిళను అడ్డం పెట్టుకుని నీచానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఆ నటిపై చాలా రాష్ట్రాల్లో కేసులున్నాయని, అలాంటామెను అడ్డంపెట్టుకుని తమ పార్టీపై బురద జల్లుతున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
కాగా ముంబై నటి కేసు విషయంలో వైసీపీ నాయకులపై విమర్శలు చెలరేగాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ముంబై నటితో వైసీపీ నాయకుడు విద్యాసాగర్ రావుకు పరిచయం అయింది. అయితే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొద్దిరోజులకు తనను పెళ్లి చేసుకోవాలని ముంబై నటి నిలదీశారు. దీంతో సదరు విద్యాసాగర్‌రావు ముఖం చాటేశారు. అంతేకాదు నటిని వేధింపులకు గురి చేశారు. ఉన్నతాధికారులు, ఓ వైసీపీ కీలక నాయకుడు అండతో ఏపీలో ఆమెపై అక్రమంగా కేసులు నమోదు చేయించారు. నటి కుటుంబ సభ్యులను వేధించారు. అయితే రాష్ట్రంలో అధికారం మారడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైసీపీ నాయకుడు విద్యాసాగర్ రావు చేసిన మోసం, అక్రమంగా కేసులు పెట్టి వేధించిన పోలీస్ ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.