ఐఆర్ఆర్ కేసులో మాజీమంత్రి నారాయణ సతీమణికి ఊరట

by Seetharam |
ఐఆర్ఆర్ కేసులో మాజీమంత్రి నారాయణ సతీమణికి ఊరట
X

దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు ఊరట లభించింది. ఐఆర్ఆర్ కేసులో మాజీమంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు మరో ముగ్గురిని సీఐడీ నిందితులుగా చేర్చింది. దీంతో రమాదేవితోపాటు వారంతా హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. అయితే ఐఆర్ఆర్ కేసులో నిందితులను సీఆర్‌పీసీలోని 41 ఏ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని సీఐడీ పేర్కొంది. అంతేకాదు న్యాయవాది సమక్షంలో విచారణ జరుపుతామని సీఐడీ తరఫు న్యాయవాది వెల్లడించారు. ఈ కేసులో అరెస్ట్‌ చేయమని తెలిపారు. దీంతో పిటీషన్‌లను న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డి డిస్పోజ్ చేశారు. ఇదిలా ఉంటే ఇదే ఐఆర్ఆర్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరికొంత ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పొడిగించింది.తదుపరి విచారణ ఈ నెల 18కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

Next Story