‘ఈవీఎం ట్యాంపరింగ్ వంద శాతం నిజం’.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘ఈవీఎం ట్యాంపరింగ్ వంద శాతం నిజం’.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ ఎన్టీఆర్ జిల్లా,ప్రతినిధి: ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకే అధికార పార్టీ చేసే ప్రయోగం. భారత దేశ ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే బ్యాలెట్ పోలింగ్ విధానం కావాలి. అభివృద్ధి చెందిన అమెరికా దేశంలోని బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది. విజయవాడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ.. తెలంగాణ సెక్రటేరియట్ రాజా భోగంలా ఉంటే ఆంధ్రాలో ఐదు షెడ్లు వేసి సెక్రటేరియట్ అంటున్నారు. 14 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఇప్పటికీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోయారు. దళితులు రెండుగా చీలటం వల్లే ఆంధ్ర విభజనకు నాంది పడింది. రాష్ట్ర విభజన వలన ఆంధ్రప్రదేశ్ నష్ట పోయింది. కూటమి ప్రభుత్వం 100 రోజులలో ఏ ఒక్క పథకం అమలు చేయలేకపోయారు. రాష్ట్రంలో పెన్షన్ తప్ప ఇప్పటికే ఏమీ అమలు కాలేదు.

పెన్షన్ల పంపిణీకి ముఖ్యమంత్రి ఎందుకు నలుగురు ముఖ్యమంత్రులతో పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ ప్రకారం పోలవరం పూర్తి కాదు. ప్రపంచంలో మూడు కంపెనీ తప్ప ఎవరి వల్ల పోలవరం కట్టడం పూర్తి కాదు 4000 వేల మంది గిరిజనులను ఖాళీ చేయిస్తే తప్ప పోలవరం నిర్మాణానికి ఆటంకం తొలగదు అమరావతి పూర్తి కాలేదు కానీ చెన్నై నుండి రియల్టర్లు వచ్చి అమరావతిలో భూమి ధరను పెంచుతున్నారు అమరావతి పూర్తి చేయాలంటే 100 సంవత్సరాల పైనే పడుతుంది. నిన్న డ్రోన్ ఎగర వేశారు. ఏమీ ఉపయోగం. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి. తిరుపతి లడ్డు పై అవాస్తవ ప్రచారం చేసి బోల్తా పడ్డ చంద్రబాబు సూపర్ 6 అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ కు చంద్రబాబు నాంది పలుకుతున్నాడు పేదలకు కావలసింది తక్కువ ధరలో నిత్యావసర సరుకులు, ఉపాధి కల్పన కాంగ్రెస్ పార్టీ అంటే సిద్ధాంతాలు కలిగినది జగన్ షర్మిల మధ్య వ్యవహారం వ్యక్తిగతం. గత చంద్రబాబు కు ఇప్పటికీ బాబుకు తేడా ఉంది, ఢిల్లీ పెద్దల వద్ద సాగిల పడుతున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed