Minister Sridhar Babu: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో నేను మాట్లాడుతా

by Gantepaka Srikanth |
Minister Sridhar Babu: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో నేను మాట్లాడుతా
X

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల ఘటన(Jagtial incident)పై మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జీవన్ రెడ్డి(Jeevan Reddy) లాంటి వ్యక్తిని కోల్పోవడానికి తాము సిద్ధంగా లేము. ఆయన చాలా సీనియర్ లీడర్. రాష్ట్ర పార్టీలో చాలా ముఖ్యమైన నాయకులు. జీవన్ రెడ్డి సేవలు పార్టీకి చాలా అవసరం. హైకమాండ్ ఆదేశాలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఇప్పటికే జీవన్ రెడ్డితో మాట్లాడారు. నేను కూడా ఆయనతో మాట్లాడుతాను. ఇప్పటికే జగిత్యాల ఘటనకు సంబంధించిన వివరాలు అన్నీ పార్టీకి చేరాయి. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తాం. దాడి వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టం. నిందితులను కఠినంగా శిక్షిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించం’ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.

అయితే.. జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కారుతో వెనుక నుంచి ఢీ కొట్టి, సంతోష్‌ అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన గంగారెడ్డి.. ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడు. పాతకక్షలతోనే హత్య చేసినట్లు పోలీసులు అనమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని గంగారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. పోలీసుల తీరుపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ రాజ్యంలో కాంగ్రెస్‌ నేతలకే రక్షణ కరువైందని ఆరోపించారు. ఇక కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్ర పార్టీ పెద్దలు జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed