Congress: ఆ గుణమే ప్రియాంకను గెలిపిస్తుంది.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-10-23 10:15:01.0  )
Congress: ఆ గుణమే ప్రియాంకను గెలిపిస్తుంది.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: త్యాగం చేసే గుణమే ప్రియాంకను గెలిపిస్తుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వయనాడ్ ఎంపీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ సోదరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన.. ప్రియాంక ఎప్పుడూ తన కుటుంబం మరియు స్నేహితుల కోసం ఏదైనా త్యాగం చేసే వ్యక్తి అని, ఈ అసాధారణమైన గుణమే ఆమెను వయనాడ్‌కు ఎంపీగా చేస్తుందని స్పష్టం చేశారు. ఆమెకు వయనాడ్ ప్రజలు కుటుంబమని అన్నారు. అంతేగాక మీరు నాకు ఇచ్చిన విధంగానే ఆమెకు కూడా మద్దతు ఇవ్వాలని ఆమె సోదరుడిగా వయనాడ్ ప్రజలను కోరుతున్నానని అన్నారు. ఇక ఒక అనధికారిక ఎంపీగా వయనాడ్‌కు తాను ఎప్పుడూ అండగా ఉంటానని రాహుల్ గాంధీ చెప్పారు. కాగా వయనాడ్ ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో వయనాడ్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్ధిగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పేరును పార్టీ ఖరారు చేసింది.

Advertisement

Next Story

Most Viewed