YS Jagan: కూటమి పాలనలో మహిళలకు రక్షణ, ప్రజలకు భరోసా లేదు

by Mahesh |
YS Jagan: కూటమి పాలనలో మహిళలకు రక్షణ, ప్రజలకు భరోసా లేదు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్(Former CM Jagan) ఈ రోజు బద్వేల్‌(Badwel)లో పర్యటించారు. ఈ నెల 19 శనివారం రోజు యువతిని అటవీ ప్రాంతంలోకి లాక్కెల్లి.. పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువతి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా ఈ ఘటనపై మాజీ సీఎం జగన్(Jagan) స్పందిస్తూ.. ఈ రోజు యువకుడి చేతిలో హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శనివారం ఘటన జరిగితే ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. తాను బద్వేల్‌లో పర్యటిస్తున్నాననే యువతి కుటుంబ సబ్యులకు సాయం అందించారు. రాష్ట్రంలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ, ప్రజలకు భరోసా లేకుండా పోయిందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed