Pithapuram: జనసేన ఆవిర్భావ సభకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లు ఇవే..!

by srinivas |   ( Updated:2025-03-11 15:55:18.0  )
Pithapuram: జనసేన ఆవిర్భావ సభకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లు ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన(Janasena) పార్టీ ఆవిర్భావ సభ(Party founding meeting)కు సర్వం సిద్ధం చేస్తున్నారు.. జనసేన పెట్టి 12 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ నెల 14న పార్టీ ఆవిర్భావ సభను కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహిస్తున్నారు. పార్టీ సభకు వచ్చే జనసైనికుల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. సభ ప్రాంగణంతో పాటు చుట్టూ డెకరేషన్ ఏర్పాట్లు సైతం పూర్తి చేస్తున్నారు. వాహనాల్లో వచ్చే వారికి కోసం 5 చోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఎండ తీవ్రత దృష్ట్యా మంచినీరు, మజ్జిగ, ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా సూచించిన మేరకు జనసైనికులకు పండ్లు సైతం అందించనున్నారు. మొత్తం 7 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. దాదాపు 14 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. వీటికి సంబంధించిన సిబ్బంది అంతా ఎప్పటి నుండో పార్టీకి స్వచ్చందంగా సేవ చేస్తున్నారు. అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం కూడా ముందుకొచ్చి అంబులెన్సులు, ఇతర సౌకర్యాలు కల్పించారు. జనసైనికులు జాగ్రత్తగా వచ్చి సభకు హాజరై అనంతరం తిరిగి సురక్షితంగా ఇంటికి వెళ్లాలని ఆ పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) తెలిపారు.

Next Story