వన్యప్రాణుల అక్రమ రవాణా చేసినా... అటవీ ఉద్యోగులపై దాడి చేసిన కఠిన చర్యలు: డిప్యూటీ సీఎం

by Mahesh |
వన్యప్రాణుల అక్రమ రవాణా చేసినా... అటవీ ఉద్యోగులపై దాడి చేసిన కఠిన చర్యలు: డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాష్ట్రంలో ఎవరైనా వన్యప్రాణులను అక్రమ రవాణా చేసినా... అటవీ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయపురి సౌత్ రేంజ్ అటవీ శాఖ ఉద్యోగుల పై దాడి ఘటనపై పల్నాడు కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడిన తర్వాత పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో వన్య ప్రాణులను, జంతువులను వేటాడి, అక్రమ రవాణా చేసేవారిపై ఉపేక్షించవద్దని.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా ఇటీవల పల్నాడు జిల్లాలోని విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో వన్య ప్రాణి అలుగు (పంగోలియన్)ను వేటాడి అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకొనేటప్పుడు అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేశారు. ఇదే విషయమై మంగళవారం ఉదయం ఆరా తీశారు. ఉద్యోగులపై దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంత పరిసరాల్లో ప్రజలకు అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed