వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా ఏం చేయలేరు.. ఫ్లెక్సీల వివాదంపై కొడాలి నాని

by Ramesh Goud |   ( Updated:2024-01-18 08:02:30.0  )
వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా ఏం చేయలేరు.. ఫ్లెక్సీల వివాదంపై కొడాలి నాని
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు వివాదం రచ్చకెక్కుతొంది. ఈ వివాదంపై ఏపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన ఎన్టీఆర్ కుమారుడు, నందమూరి బాలకృష్ణ.. అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడి నుండి తీసేశారు. అంతకుముందే సీనీనటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్వర్గీయ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించేందుకు అక్కడికి చేరుకోవడంతో వారి ఫ్యాన్స్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ఫ్లెక్సీల తొలగింపు ఘటనపై కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. లోకేశ్ కోసమే జూనియర్ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు తొలగిస్తే ఏమైనా నష్టం జరిగిందా అని ప్రశ్నించారు. వాళ్లది నీచాతినీచమైన బుద్ధి అని, ఈ సందర్భంగా బాలకృష్ణ, చంద్రబాబులను ఉద్దేశించి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఏం చేయలేరని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎన్టీఆర్‌ వర్ధంతి చేస్తారా అంటూ కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఇక ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా.. గుడివాడలో రాజకీయ రగడ కొనసాగుతోంది. ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా టీడీపీ, వైసీపీ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడం ఈ ఉద్రిక్తతలకు కారణం అయింది. గుడివాడలో రా కదలిరా పేరుతో టీడీపీ భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. మరోవైపు.. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలోనూ ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తుండటంతో రెండు పార్టీలు ఇప్పటికే పోటాపోటీగా ఫ్లెక్సీలు, పోస్టర్లు అంటించాయి. దీంతో గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ రెండు కార్యక్రమాల నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోస్తు ఏర్పాటు చేశారు.

Read More..

జూనియర్ NTR ఫ్లెక్సీలు తీయించేయ్ అని బాలకృష్ణ హుకుం (వీడియో)

jnr NTRను దూరం పెడుతున్న నందమూరి ఫ్యామిలీ.. ఆ విషయంలోనేనా?

Advertisement

Next Story