దేశ ద్రోహులపై ఎస్మా ప్రయోగించాలి.. అంగన్‌వాడీలపై కాదు : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

by Shiva |
దేశ ద్రోహులపై ఎస్మా ప్రయోగించాలి.. అంగన్‌వాడీలపై కాదు : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
X

దిశ, వెబ్‌డెస్క్‌ : దేశ ద్రోహులు, ఎర్రచందనం స్మగ్లర్లపై ఎస్మా చట్టం ప్రయోగించాలని అంగన్‌వాడీలపై కాదని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఇవాళ తిరుపతిలో ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలకు ఆయన మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఎస్మా ప్రయోగించిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి పట్టిన గతే సీఎం జగన్‌కు పడుతుందని హెచ్చరించారు. దేశద్రోహులు, ఎర్రచందనం స్మగ్లర్లపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించాలని దుయ్యబట్టారు. 1975 ప్రాంతంలో దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రయోగించారని.. అనంతరం ఆమె రాజకీయంగా పతనం అయిందన్నారు. రాష్ట్రానికి నిర్విరామంగా సేవ చేస్తున్న అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగిస్తే వైసీపీ ప్రభుత్వానికి పాపం చుట్టుకుంటుదని హితవు పలికారు.

Advertisement

Next Story