- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పర్యావరణ పరిరక్షణ ఇంటినుండే మొదలు కావాలి : Pawan Kalyan
దిశ, వెబ్ డెస్క్ : పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని, ఎవరికి వారు తమ ఇంటి నుండే పర్యావరణ పరిరక్షణ మొదలు పెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. సోమవారం మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించి, జీవవైవిధ్యాన్ని కాపాడితేనే 'వసుధైక కుటుంబం' అనే పేరు సార్థకం అవుతుందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు అనుకూల వాతావరణాన్ని అందించాలి అంటే ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. వారోత్సవాల్లో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మలను ఆసక్తిగా తిలకించి.. వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. సముద్ర తాబేళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఫానా యాప్ ను, కింగ్ కోబ్రాల సంరక్షణ బ్రోచర్ ను ఆవిష్కరించారు. వన్యప్రాణి సంరక్షణ ప్రాధాన్యం మీద విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.