ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు బిగ్ షాక్.. త్వరలో సేవలు నిలిపివేత

by Disha Web Desk 16 |
ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు బిగ్ షాక్.. త్వరలో సేవలు నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు షాక్ తగలనుంది. త్వరలో ఆరోగ్య సేవలు నిలిపివేయనున్నట్లు ఆస్పత్రుల యాజమానులు ప్రకటించారు. ఆరు నెలలుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్య సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 4 నుంచి మొదటగా ఈహెచ్ఎస్ పథకం కింద ఉద్యోగులకు అందించే సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆరోగ్య శ్రీ సేవలు కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈశోకు ఆస్పత్రుల యజమానులు లేఖ రాశారు. బకాయిలు చెల్లింపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

కాగా ఏపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 25 లక్షలకు పెంచామని చెబుతోంది. అయితే ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేయకుండా పెండింగ్‌లో పెట్టింది. దీంతో ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురుస్తోంది. మరి సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించి వెంటనే ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు బకాయిలు విడుదల చేస్తారేమో చూడాలి.

Read More..

ఏపీలో నాసిరకం మద్యం.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed