- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ ఎన్టీఆర్... ఫొటోలు వైరల్
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సైతం ఓటు వేశారు. అయితే అది 1983లో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వేశారు. ఇప్పుడు ఆ ఫొటోను ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
కాగా నందమూరి తారక రామారావు మార్చి 29, 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. చైతన్య రథం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జైత్ర యాత్ర నిర్వహించారు. ఆ వెంటనే ఎన్నికలు రావడంతో ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. జైత్ర యాత్రను జనవరి1,1983న తిరుపతిలో ముగించారు. అనంతర శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో నందమూరి తారక రామారావు ఖాకీ వర్ణం దుస్తులతో కనిపించారు. జనవరి 3, 1983న జరిగిన ఎన్నికల్లో ఖాకీ వర్ణము దుస్తులతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ రోజు ఏపీలో ఎన్నికల పోలింగ్ జరుగుతుండటతో నందమూరి తారక రామారావు ఓటు హక్కు వినియోగించుకున్న ఫొటోలను ఆయన తనయుడు రామకృష్ణ షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.