- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఏపీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. పోలింగ్ తేదీ ఇదే..
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల నగరా మోగింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్టాలకు ఎన్నికల తేదీని సీఈసీ ప్రకటించింది. లోక్ సభతో పాటు 4 రాష్టాలకు శాసన సభ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏపీలో మే 13న పోలింగ్ , జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుందని తెలిపారు. ఏప్రిల్ 25 నామినేషన్లకు చివరి గడువు, ఏప్రిల్ 26న స్కుటినీ, 29న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని స్పష్టం చేశారు. మే 13నే ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు. తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక, 17 ఎంపీ సీట్లకు పోలింగ్ జరగనుందని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. ‘ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికలు. ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్. మే 7న మూడో దశ పోలింగ్. మే 13న నాల్గొ దశ పోలింగ్. మే 13నే ఏపీ, తెలంగాణ పోలింగ్. మే 20న ఐదో దశ పోలింగ్. మే 25న ఆరో దశ పోలింగ్. జూన్ 1న ఏడో దశ పోలింగ్.’ జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
Read More..