- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజ్యంగాన్ని సక్రమంగా అమలు చేసేవారిని ఎన్నుకోండి.. జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : రాబోయే ఎన్నికల్లో రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసే నాయకుడినే ఎన్నుకోవాలని జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇవాళ ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. మత విద్వేశాలు రెచ్చగొట్టే పార్టీ బీజేని ఏపీ ప్రజలు ఎప్పుడో తిరస్కరించాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇంకా ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బీజేపీతో కలిసి వెళ్తున్నాయని మండిపడ్డారు. రాజకీయా పార్టీ్లో వన్ మ్యాన్ షో ఉంటే అనంతరం ఆ పరిణామాలు రాచరికానికి వ్యవస్థకు దారి తీస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈనెల 19న ప్రారంభించడం మంచిదన్నారు. ‘నా విగ్రహాలు కన్నా.. నా పుస్తకాలతో నన్ను గుర్తించండి’ అని అంబేద్కర్ చెప్పినట్లుగా గుర్తు చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వాలను నిలదీసేందుకు గాను ప్రాంతీయ పార్టీలకు నాలుగు సార్లు అవకాశం వచ్చినా మన వారు ఉపయోగించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రజా పోరాటాలతోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవాలని తెలిపారు. నల్ల చట్టాలు, జల్లికట్టు పోరాటాలను స్మరించుకుని కదన రంగంలోకి దిగాలన్నారు.