- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ నేతలు అచ్చెన్న, అయ్యన్నకు ఈసీ షాక్.. ఉల్లంఘనపై నోటీసులు
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై సీరియస్ అయింది. సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది. రెండు రోజల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక ఇదే అంశంలో చంద్రబాబుకు సైతం ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు చేసిన ఫిర్యాదులపై ఈసీ స్పందించింది. వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
అటు వైసీపీ నాయకులకు సైతం ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. చంద్రబాబుపై మంత్రి జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలకు సైతం నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని రెండు రోజులు సమయం ఇచ్చింది. కాగా ఎన్నికల నిబంధనలను నాయకులు యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఇతర పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినా నేతలు పట్టించుకోవడంలేదు. ఎన్నికల నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Read More..
Ap News:పొత్తు గెలవాలి పాలన మారాలి అనే నినాదంతో..ప్రత్యేక మేనిఫెస్టో!