చంద్రగిరిలో కత్తుల కలకలం.. అనుమానితుల అరెస్ట్

by srinivas |
చంద్రగిరిలో కత్తుల కలకలం.. అనుమానితుల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కు ఈసీ సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. పలు ప్రాంతాల్లో పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటన దృష్ట్యా అలెర్టైన ఎన్నికల అధికారులు, పోలీసులు పటిష్ట భద్రత అమలు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో మద్యం బాటిళ్లు, కత్తులు కలకం రేగాయి. గాదెంకి టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేశారు. టెంపో వాహనంలో 29 ఫుల్ మద్యం బాటిళ్లు, 26 బీర్ సీసాలు, రెండు కత్తులు తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు మంగళూరులో చేపల వేటకు కోసం నెల్లూరు జిల్లా కావలి నుంచి వెళ్తున్న మత్య్సకారులుగా తెలుస్తోంది. వేట సీజన్ ముగియడంతో టెంపోలో తిరిగి స్వగ్రామాలకు వెళ్తున్నట్లుగా గుర్తించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కాగా చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసింది. ఈ నియోజకరవ్గంలో వైసీపీ నుంచి మోహిత్ రెడ్డి పోటీ చేయగా.. టీడీపీ నుంచి పులివర్తి నాని బరిలో దిగారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యయత్నం కేసు నమోదు చేసి పలువురు వైసీపీ నాయకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి సమయంలో చంద్రగిరిలో కత్తులు కలకలం సృష్టించడం చర్చగా మారింది.

Advertisement

Next Story

Most Viewed