Tragedy: బాలుడి ప్రాణం తీసిన తూకం ఉయ్యాల

by srinivas |   ( Updated:2023-05-16 08:19:46.0  )
Tragedy: బాలుడి ప్రాణం తీసిన తూకం ఉయ్యాల
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలంలో విషాదం చోటు చేసుకుంది. అంగన్వాడీ సెంటర్‌లో బాలుడు మృతి చెందాడు. తూకం వేసే ఉయ్యాల తాడు మెడకు చుట్టుకోవడంతో 11 ఏళ్ల బాలుడు చంద్రశేఖర్ అక్కడికక్కడే చనిపోయాడు. అయితే అంగన్వాడీ టీచర్ సెలవు పెట్టారు. దీంతో సహాయకురాలు విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలను తీసుకొచ్చేందుకు సహాయకురాలు వెళ్లడంతో ఈ ఘటన జరిగింది. తలుపులు తీసుకుని వెళ్లి చంద్రశేఖర్ తూకం ఉయ్యాల ఎక్కాడు. ఆ సమయంలో బాలుడు మెడకు తాడు చుట్టుకుంది. ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Advertisement

Next Story