- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajuhmundry: చంద్రబాబుకు రాసిన 7 లక్షల లేఖలు ఎక్కడ?
దిశ, రాజమండ్రి: చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాసిన 7 లక్షల లేఖలు ఎక్కడని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తమ నాయుకుడి అరెస్టు అనంతరం జరిగిన పరిణామాలపై ఆందోళన చెందిన లక్షలాది మంది కార్యకర్తలు ఆయనకు మద్దతు తెలుపుతూ రాసిన లేఖలను చంద్రబాబుకు చేరకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటుందని మండిపడ్డారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరిలు రాజమహేంద్రవరం దాన్వాయిపేటలోని తపాలా కార్యాలయానికి చేరుకుని సంబంధిత అధికారులను లేఖలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆందోళన చెందిన తెలుగు ప్రజలు ఆయనకు తమ మద్దతు తెలిపే ఆలోచనతో రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది పోస్టుకార్డులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు రాసినట్లు బొడ్డు వెంకట రమణ చౌదరి తెలిపారు. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడికి కేవలం 50 వేల లేఖలు మాత్రమే చేరినట్లు పేర్కొన్నారు. మిగతా లేఖలు ఎక్కడ అని తపాలా అధికారులను ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం కావాలనే ఈ లేఖలను చంద్రబాబు నాయుడుకు అందకుండా చేస్తుందని మండిపడ్డారు. ఇలా ప్రజలు రాసిన లేఖలను చంద్రబాబుకు అందకుండా చేయడం అంటే ప్రజల వాక్ స్వాతంత్యాన్ని అడ్డుకోవడమే బొడ్డు వెంకట రమణ చౌదరి అని స్పష్టం చేశారు.
ఇదే విషయంపై అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ఐదు రోజులుగా చంద్రబాబుకు రాసిన లేఖల్లో కొన్ని లేఖలను మాత్రమే రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపినట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి చంద్రబాబుకు పెద్ద ఎత్తున లేఖలు వస్తున్న విషయాన్ని అధికారులు ధృవీకరించినట్లు చెప్పారు. లేఖలను సేకరించేందుకు జైలు నుంచి ఓ అధికారి పోస్టాఫీసుకు వచ్చి తీసుకెళ్లుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఒక్కరోజే దాదాపు 20వేల లేఖలు పోస్టాఫీసుకు వచ్చినట్లు స్పష్టం చేశారు.
దీనిపై స్థానిక తపాలా అధికారులు స్పందిస్తూ.. 50 వేల లేఖలను మాత్రమే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడికి పంపినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేతల ప్రశ్నలకు బదులిస్తూ మిగతా లేఖలు రానున్న రెండు రోజుల్లో రాజమండ్రి చేరుకునే అవకాశం ఉందని చెప్పారు.