- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TDP Mahanadu: పసుపు మయమైన రాజమండ్రి.. కాసేపట్లో సభా వేదికకు చంద్రబాబు
దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: రాజమహేంద్రవరంలో ఇవాళ, రేపు టీడీపీ మహానాడు కార్యక్రమం జరగనుంది. వేమగిరి పరిధిలో భారీ ప్రాంగణంలో కాసేపట్లో మహానాడు ప్రారంభంకానుంది. పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు టీడీపీ ఇంచార్జీలు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపీలు, శుక్రవారం సాయంత్రమే రాజమహేంద్రవరం చేరుకున్నారు. దీంతో పట్టణంలో ఉన్న అన్ని లాడ్జిలు,హోటల్‌లు హౌస్ ఫుల్ బోర్డ్‌లు పెట్టాయి.
కాసేపట్లో వేదిక మీదకు చంద్రబాబు
మరికాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు సభా వేదిక మీద ఆసిలు కానున్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి తనంతరం చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించనున్నారు. సుమారు గంట చంద్రబాబు ప్రసంగం ఉంటుంది, ముఖ్యంగా అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు, అధిక ధరలు, నిలిచిపోయిన అభివృద్ధి, రైతులు పడుతున్న ఇబ్బందుల, వంటి అంశాల మీద చంద్రబాబు ప్రసంగం సాగనుంది. దీనితో పాటు రాబోయే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఇంచార్జిలకు, పార్టీ కార్యకర్తలకు నూరి పోసే విధంగా ఉత్తేజంగా ఉద్వేగ భరితంగా ఆయన ప్రసంగం కొనసాగనుంది.
యువతను ఉద్దేశించి ప్రసంగించనున్న లోకేష్
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేకించి యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు, రాష్టంలో నిరుద్యోగం ఏ విధంగా పెరిగింది, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, ఫీజు రీయింబర్స్మెంట్ రాని వైనం వంటి అంశాలపై నారా లోకేష్ ప్రసంగించనున్నారు. అదే విధంగా తన పాదయాత్రలో లోకేష్ దృష్టికి వచ్చిన అనేక విషయాలను మహానాడులో హాజరైన కార్యకర్తలకు అయన వివరించనున్నారు.
తెలుగు తమ్ముళ్లకు గోదావరి గుమగుమలు
మహానాడుకి హాజరుకానున్న, తెలుగు తమ్ముళ్లకు ప్రత్యేకమైన గోదావరి వంటకాలు తయారు చేస్తున్నారు. నేటి ఉదయం అల్పాహారం నుండి రేపటి మధ్యాహ్నం భోజనం వరకు ఉభయగోదావరి జిల్లాల్లో ప్రాచుర్యం గల అనేక రకాల నీసు మాంసాలతో పాటు పిండివంటలు తయారు చేయనున్నారు. దీనికోసం పది మంది నిష్ణర్తులైన వంట మనుషులను సిద్ధం చేశారు. అంతే కాకుండా ప్రత్యేక ప్రాథమిక చికిత్స కోసం హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. ప్రాంగణం వద్ద రాజమండ్రి జిల్లాకి చెందిన టిడిపి ఇంచార్జిలు, రాజమండ్రి రూరల్ ఏమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, సిటీ ఏమ్మెల్యే అధిరెడ్డి భవాని తదితరులు పలు సేవలు అందిస్తున్నారు.
Read more: