- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే చంటి అవినీతిని సీరియల్‌గా విడుదల చేస్తా: జ్యోతులనెహ్రూ
దిశ, జగ్గంపేట: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు అవినీతి బాగోతాన్ని సీరియల్ మాదిరిగా ప్రతివారం మీడియాకు విడుదల చేస్తానని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. తమ అధినేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటన అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. వెయ్యి మందిపై కాదని, సభకు వచ్చిన వారందరిపై కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ఎమ్మెల్యే చంటి బాబు తండ్రి సొసైటీ చైర్మన్‌గా ఉంటూ 18 ఎకరాల నుంచి 54 ఎకరాల రైతుగా ఎదిగాడని గుర్తు చేశారు. చివరికి అవినీతి ఉచ్చులో పడి సొసైటీకి 30 లక్షల రూపాయలు కట్టాల్సి రావడం మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనకు జగ్గంపేట సీటు ప్రకటించారని.. ఎమ్మెల్యే పరిస్థితి ఏంటో అర్థం కావడంలేదన్నారు. ఎమ్మెల్యే చంటిబాబు గండేపల్లి మండలం రామేశ్వరంపేటలోని గుల్లమెట్ట కొండకు చెందిన 154 ఎకరాల ఎర్రమట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. అంతేకాదు ఎకరాకు పది లక్షలు చొప్పున ఆయన అనుచరగణం దోచుకున్నారని వ్యాఖ్యానించారు. దమ్ముంటే వాటిపై శ్వేత పత్రం విడుదల చేయాలని జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు.