Disappointment: చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం

by srinivas |   ( Updated:2023-02-15 14:57:18.0  )
Disappointment: చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. అయితే బూరుగుపూడి వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్యామేజ్ అయ్యింది. చంద్రబాబుకు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


అయితే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు పర్యటనలో చోటు చేసుకుంటున్న విషాద ఘటనలపై పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు భద్రతపై ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story