- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chandrababu Custody: కస్టడీలో చంద్రబాబుపై ప్రశ్నల వర్షం.. ఆ పదిపైనే ఆరా..!
దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ అధికారులు కస్టడీలో విచారిస్తున్నారు. ఈ ఉదయం 9.30 గంటల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులో ఆయనను ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత కూడా చంద్రబాబును అధికారులు విచారిస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబుకు అధికారులు 10 ప్రశ్నలు సంధించారు. ‘రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా ఎలా నిర్ణయించారు..?, సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో జీవో ఎలా ఇచ్చారు?., అగ్రిమెంట్ ఏ విధంగా జరిగింది?, జీవోకి విరుద్ధంగా ఒప్పందం ఎలా చేశారు..?. 13 చోట్ల నోట్ ఫైళ్లపై సంతకం చేసి అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారు..?, డిజైన్ టెక్ కంపెనీకి చేరిన నిధులను తరలించడం మీకు తెలుసా?. నిధులు తరలించిన మనోజ్ పార్థసారధితో ఉన్న సంబంధమేంటి..?. సీఐడీ నోటీసులు ఇవ్వగానే వారు ఎందుకు పారిపోయారు..?..’అని చంద్రబాబును ప్రశ్నించారు. వీటన్నింటికీ కూడా చంద్రబాబు ఏం చెప్పారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీర్పు ప్రకారం చంద్రబాబు చెప్పిన సమాధానాలు రికార్డు చేసి ధర్మాసనానికి సమర్పించాల్పి ఉంటుంది. ఇవాళ్టి సీఐడీ విచారణ మరికాసేపట్లో ముగియనుంది. ఆదివారం కూడా చంద్రబాబును ప్రశ్నించనున్నారు.