Breaking: సామర్లకోటలో దోపిడీ దొంగల బీభత్సం

by srinivas |   ( Updated:2023-06-12 17:33:02.0  )
Breaking: సామర్లకోటలో దోపిడీ దొంగల బీభత్సం
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా సామర్లకోటలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఆటో డ్రైవర్‌ను కత్తితో పొడిచారు. ప్రయాణికుల్లా దోపిడీ దొంగలు ఆటోలో ఎక్కారు. ఆటో డ్రైవర్‌తో పాటు ప్రయాణికులపై దాడి చేశారు. మహిళా ప్రయాణికురాలిపై దాడి చేసి నగలు అపహరించుకుపోయారు. ఆటో డ్రైవర్ తో పాటు మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు. ఘటన సమయంలో ఆటోలో మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story