Breaking: పవన్ కల్యాణ్ పర్యటనలో అపశ్రుతి.. 20 మంది అభిమానులకు గాయాలు

by srinivas |   ( Updated:2023-06-16 17:30:35.0  )
Breaking: పవన్ కల్యాణ్ పర్యటనలో అపశ్రుతి.. 20 మంది అభిమానులకు గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంటుంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ బహిరంగ సభకు జనసైనికులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇక పవన్ కల్యాణ్‌ను చూసేందుకు అభిమానులు చెట్టుపైకి ఎక్కారు. అయితే చెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగిపడింది. ఈ ఘటనలో 20 మంది అభిమానులకు గాయాలయ్యాయి. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అభిమానులకు జనసేన నేతలు పలు సూచనలు చేశారు. పవన్ కల్యాణ్ కింద నుంచే చూడాలని.. ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్లు, ఎత్తులు ఎక్కవద్దని, విద్యుత్ తీగలను గమనించాలని పిలుపు నిచ్చారు. తమ కోసం ఇంటి దగ్గర వారు ఎదురు చూస్తుంటారని.. సభ ముగిసిన తర్వాత జాగ్తత్రగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story