- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Varahi Yatra: తన్ని తగలేస్తాం.. ఈడ్చి కొడతాం.. వైసీపీ నేతలపై పవన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం
దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ పెద్దలంతా ఫ్యాక్షనిస్టులేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం వారాహియాత్రలో వైసీపీ నేతలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల పవన్ కల్యాణ్‌పై దాడి చేసేందుకు సిద్ధమైన కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను గుర్తు చేస్తూ పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ఒంటిపై చేయి పడితే తన్ని తగలేస్తానని హెచ్చరించారు. జనసేన ప్రభుత్వం వచ్చాక ఆ క్రిమినల్స్‌ను ఇళ్ల నుంచి బయటకు లాక్కొచ్చి కొడతామని వార్నింగ్ చేశారు. 2024లో వైసీపీ ప్రభుత్వం రాదని, వాళ్లు సై అంటే తాను కూడా రెడీ అని సవాల్ విసిరారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కడా కూడా వైసీపీ గెలవకుండా చూస్తానన్నారు. అక్కా, చెల్లెళ్లపై చేయిపడితే సహించమని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు అడ్డు వస్తే కాళ్లు, చేతులు, విరగొట్టే చట్టాలు తీసుకువస్తానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్ అనే అనకొండ సొంత బాబాయ్‌ను మింగేసిందని పవన్ కల్యాణ్ విమర్శించారు. డ్రైవర్‌ను చంపి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలీవరి చేశారని మండిపడ్డారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గరకు వెళ్లి అనంతబాబు కాపాడమని అడిగారని ధ్వజమెత్తారు. చంపింది కాపు అని, చనిపోయింది దళితుడు అని, కాపాడింది రెడ్డి అని, ఇలా చేయడంతోనే సామాజిక వర్గాల్లో విభేదాలొస్తున్నాయని పవన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అనంతబాబు చేసిన హత్యకు కాపులకు అంటగట్టొద్దన్నారు. అక్రమాలన్నీ ఎమ్మెల్యే ద్వారంపూడికి కనెక్ట్ అవుతున్నాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సీఎం జగన్ అంటే తనకు ద్వేషం లేదని, కానీ బాంచన్ అని మొక్కడానికి తాను రెడీగా లేనని చెప్పారు. తాను విప్లవకారుడినని, ఎవరీ భయపడనని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.